ఇంట్లో తల్లిదండ్రులు కొత్తబట్టలు కొనివ్వలేదని సరోజ అనే పదేళ్ల బాలిక... అలిగి ఇంట్లో నుంచి వెళ్లి తప్పిపోయింది. బాలిక మిస్సింగ్ కేసును గుంతకల్లు పోలీసులు రెండు రెండు గంటల్లో ఛేదించి.. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయం ఈటీవీ-భారత్లో ప్రసారం కావటంతో డీజీపీ గౌతమ్ సవాంగ్...జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు చరవాణి ద్వారా డీఎస్పీ, గుంతకల్లు పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు.
డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..కథల వీధిలో నివాసముంటున్న మరియమ్మ కూతురు సరోజ తప్పిపోయినట్లు తమకు తెలిసిందన్నారు. తమ సహచరులను హై అలెర్ట్ యాప్ ద్వారా కనుక్కోవాలని తెలిపామన్నారు. రెండవ పట్టణ పోలీసులు సీఐ చిన్నగోవిందు, ఎస్సై సురేశ్ బాబుతో కలిసి ఎనిమిది బృందాలు దాదాపు 2 గంటలపాటు గుంతకల్లు పట్టణాన్ని జల్లెడ పట్టారన్నారు. చివరకు 3 కి.మీ దూరంలో చర్చ్ వద్ద పాపను కనుక్కొని.. తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. శనివారం బాలల దినోత్సవం కాబట్టి ఎస్పీ ఆదేశాల మేరకు పాపకు కొత్త బట్టలు కొనిచ్చామన్నారు. తమ కృషిని గుర్తించి అభినందించిన డీజీపీ, జిల్లా ఎస్పీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచదవండి