ETV Bharat / state

'నేరాల్లో ఇరుక్కోవద్దు.. పరస్పర స్నేహభావంతో మెలగాలి' - awareness program on anti law activities

అనంతపురం జిల్లా ఏస్పీ ఆదేశాల మేరకు ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా.. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల పట్ల ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు.

awareness program on anti law activities
నేరాల్లో ఇరుక్కోవద్దు.. పరస్పర స్నేహభావంతో మెలుగాలి
author img

By

Published : Dec 4, 2020, 6:01 PM IST

అసాంఘిక కార్యకలాపాలు, నేరాల పట్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను అనంతపురం జిల్లా పోలీసులు చైతన్యపరుస్తున్నారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. కక్షలు, నేరాల కేసుల్లో ఇరుక్కుపోవద్దని... పరస్పర స్నేహభావంతో మెలుగుతూ సంతోషంగా జీవించాలన్నారు. జిల్లా ఏస్పీ ఆదేశాల మేరకు ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఎస్సైలు ప్రతీరోజూ వారి పరిధిలోని ఏదో ఒక గ్రామానికి వెళ్లి ప్రజలతో సమావేశమవుతున్నారు.

మహిళల సంరక్షణ, తదితర చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పొలం పనులకు వెళ్లినప్పుడు సమూహాలుగా ఉండరాదని.. భౌతిక దూరం పాటించాలని వివరిస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని... ఏలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు.

ఇదీ చూడండి:

భూముల రీసర్వేకు వేగంగా సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.