అనంతపురం జిల్లా గుత్తిలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.ఐదు లక్షలు విలువచేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్ల వంటివి స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 9వ తేదీన గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఐక్యూ మొబైల్ షో రూమ్ లోనే నిందితుడు ఈ వస్తువులన్నీ కాజేశాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.5,16,027 విలువచేసే 18 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చైతన్య వెల్లడించారు.
అనంతరం ముద్దాయిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు. ఇతను గతంలో కూడా పలు రాష్ట్రాలలో చోరీలకు పాల్పడి జైలు శిక్షసైతం అనుభవించాడని డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: CYBER CRIME: పోలీసులకు పెనుసవాల్‌గా సైబర్ నేరాలు