ETV Bharat / state

ఊరేగింపు వివాదం... ఇద్దరు ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా చిల్లవారిపల్లిలో.. కాటకోటేశ్వరం స్వామి విగ్రహ ఊరేగింపులో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. మనస్థాపానికి గురైన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు.

Police block procession of Katakoteshwaram Swamy idols at Chillavaripalli, Tadimarri Mandal, Anantapur district
ఊరేగింపు వివాదం... ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 13, 2021, 8:28 AM IST

ఊరేగింపు వివాదం... ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో కాటకోటేశ్వరం స్వామి విగ్రహాల ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. ఊరేగింపు పూజా కార్యక్రమాల నిర్వహణపై కొన్నేళ్లుగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతున్న కారణంగా... పోలీసులు అడ్డగించారు. అనంతరం విగ్రహాలను ఆలయంలో పెట్టించారు.

పోలీసులకు ఓ వర్గం వారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన బాల్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి స్థానికులు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

విశ్వ శాంతి కోసం దిగంబర గురువుల పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.