ETV Bharat / state

నాటుసారా బట్టీలపై దాడులు... నిందితులు అరెస్ట్​ - అనంతపురం జిల్లా నేరవార్తలు

అనంతపురం జిల్లాలో వజ్రకరూర్​, గాండ్లపెంట మండలాల్లో నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. 1100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.

నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు

author img

By

Published : Jun 9, 2020, 3:50 PM IST

అనంతపురం జిల్లా వజ్రకరూర్​ మండలం బోడసానిపల్లి తండా గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు 500 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అనంతరం నాటుసారా కాస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా నాటుసారా తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటస్వామి హెచ్చరించారు.

గాండ్లపెంట మండలం పట్రవాండ్ల పల్లి అటవీ ప్రాంతంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. కదిరి గ్రామీణ సీఐ మధు, గాండ్లపెంట ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గ్రామ పరిసరాల్లోని నాటు సారా బట్టీలను, 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.