అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామస్థులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. గ్రామానికి చెందిన నల్లయ్య, అతని కుమారుడిపై పోలీసులు అన్యాయంగా దాడి చేశారని ఆరోపించారు.
గ్రామానికి చెందిన నల్లయ్య అనే వ్యక్తి నాటుసారా తరలిస్తున్నాడనే సమాచారంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అతని బైక్ను ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నల్లయ్యకు, వారికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన కానిస్టేబుళ్లు మరికొందరు పోలీసులతో కలిసి నల్లయ్య ఇంటికి వెళ్లి అతనితో పాటు అతని కుమారుడిపై దాడికి దిగారని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనలో నల్లయ్య, అతని కుమారుడు గాయపడ్డారని చెప్పారు. పోలీసులు అన్యాయంగా వారిపై దాడి చేస్తుంటే తాము అడ్డుపడ్డామని వెల్లడించారు.
ఇదీ చదవండి