అనంతపురం గ్రామీణం రాచనపల్లికి చెందిన ఓ వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకర్ రెడ్డిని భార్య వదిలేయటంతో కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురికావటంతో సోదరి సంరక్షణలో ఉంటున్నాడు. అయితే వ్యాధి తీవ్రత అధికమవటంతో సోదరికి భారం అవుతానని భావించాడు. అదే ఆలోచనతో జాతీయ ఉద్యానవనం సమీపంలో విషం తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...