అనంతపురంలోని ఆదర్శనగర్లో విజయ్ కుమార్(18) అనే యువకుడు తనకు సెల్ఫోన్ కొనివ్వలేదని తల్లితో గొడవపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఆదర్శ నగర్లో తల్లి ఈశ్వరమ్మతో పాటుగా కుమారుడు విజయ్ కుమార్ బేల్దారి( తాపీమేస్త్రీ) పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. తనకు చరవాణి కావాలని తల్లిని అడగటంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున కొద్ది రోజులు ఆగమని తల్లి ఈశ్వరమ్మ చెప్పింది.
ఈ విషయంపై కొద్దిరోజులుగా తల్లీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొడుకును ఈశ్వరమ్మ గట్టిగా మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన విజయ్ ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: