అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తూముకుంట గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తున్న బొమ్మయ్య అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవటంతో భార్యాపిల్లలు శోక సముద్రంలో మునిగిపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ ఉమామహేశ్వరనాయుడు బొమ్మయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి 5 వేల రూపాయల సాయం అందించారు. ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబానికి అందాల్సిన సాయాన్ని వెంటనే ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు.
ఇదీ చూడండి