అనంతపురం జిల్లా సబ్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో పెనుకొండ మండలంలోని దుద్దేబండ గ్రామంలో.. రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. ఖరీఫ్ పంట నిమిత్తం రైతులకు ఈ విత్తనాలు అందిస్తున్నారు. 100 మంది రైతులకు 99 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసినట్లు పెనుకొండ మండల వ్యవసాయ అధికారి రాకేష్ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి స్వయంప్రభ, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.
గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. రైతులు ఎవరూ విత్తన పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వెంకటరామిరెడ్డి అన్నారు.
ఇవీ చదవండి:
ఎమ్మిగనూరు మార్కెట్కు పోటెత్తిన వేరుశనగ