ఎన్నికల నిర్వహణలో భాగంగా 60 రోజుల పాటు హడావిడి చేసిన ఎన్నికల కమిషన్.. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఎమ్మెల్సీ, ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఉరవకొండ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం... ఏర్పాట్లలో ఉన్న లోపాలను ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ అంశాన్ని జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలకు ఫిర్యాదు చేశానన్నారు. ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లో 200 మంది ఉండాల్సిన చోట కనీసం 50మంది నిల్చునేందుకూ స్థలం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రేపు శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందనీ.. అలాంటి ఘటనలేమైనా జరిగితే దానికి ఎన్నికల కమిషనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఇవీ చదవండి..