అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల పొలం బాట పట్టారు. తన స్వగ్రామం కౌకుంట్ల పొలాల్లో వరి పైరు నాటేందుకు భూమిని సిద్ధం చేశారు. మడిలో ట్రాక్టర్ నడిపారు. అనంతరం వేరుశెనగ కలుపు తీస్తూ తోటి రైతులతో సరదాగా గడిపారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే పయ్యావుల కేశవ్... తన పొలంలో సేద్యం చేయడంతో అక్మడున్నవారు సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన .. తన మూలాలు మర్చిపోలేదంటూ ఆనందపడుతున్నారు రైతులు. ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుండి బిజీబిజీగా గడిపిన ఆయన స్వగ్రామం కౌకుంట్లకు వచ్చి కాసేపు రైతుగా మారాడు.. అక్కడున్న రైతులతో వ్యవసాయ తదితర అంశాలపై చర్చించారు. చాలా రోజుల తరువాత ట్రాక్టర్ ఎక్కి రైతుగా మారిన పయ్యావులను చూసి గ్రామస్థులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కొనసాగుతున్న ఆనవాయితీ..వినాయకుడి పూజలో ముస్లిం సోదరులు