నిత్యం రాజకీయాలతో తీరిక లేకుండా ఉండే మాజీ మంత్రి పరిటాల సునీత.. లాక్ డౌన్ తో కాస్త విరామంగా కనిపిస్తున్నారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపటంతో పాటు వ్యవసాయ పనులు చేయడానికి వినియోగించుకుంటున్నారు. పరిటాల కుటుంబానికి ముందు నుంచీ వ్యవసాయ నేపథ్యం ఉన్న కారణంగా.. మాజీ మంత్రి సునీత అప్పడప్పుడు పొలానికి వెళ్తుంటారు.
మంత్రిగా ఉన్న సమయంలోనూ విత్తనాలు వేయడం, వరినాట్లు కోయడం వంటి పనులు చేసే వారు. ఇప్పుడు సమయం దొరకడంతో తమ వ్యవసాయ క్షేత్రంలో సాగులో ఉన్న బత్తాయిపళ్లను కోస్తూ కనిపించారు. కూలీలతో పాటు తానూ పని చేశారు. మాస్కు ధరించి ఉత్సాహంగా కనిపించారు.
ఇదీ చదవండి: