వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో కొందరు వైకాపా నేతలు... తెదేపా కార్యకర్త రామాంజనేయులపై దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. వైకాపా చర్యలకు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'సినిమాల్లో గబ్బర్‌సింగ్.. రాజకీయాల్లో రబ్బర్‌సింగ్'