అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. స్థానిక నేతలు హోరాహోరీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో రేపు ఎన్నికల ప్రచారం ముగియనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.
ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో రెండో విడత ఎన్నికలు విజయవంతం