అనంతపురం జిల్లా గుత్తిలో దారుణం జరిగింది. మద్యం సీసాలతో కొట్టి ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు.
గుత్తి రైల్వే కాలనీకి చెందిన అశోక్ అనే పెయింటర్.. రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు పట్టణమంతా గాలించారు. ఈ క్రమంలో.. ఉదయాన్నే పట్టణ శివార్లలో అశోక్ రక్తపు మడగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందిచారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మద్యం సీసాలతో తలపై విచక్షణారహితంగా కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు వివరించారు. హత్యకు గల కారణాలు వివాహేతర సంబంధమేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం... 13మందికి తీవ్ర అస్వస్థత