కర్ణాటకలోని తోరణగల్లు జిందాల్ ఫ్యాక్టరీ నుంచి.. భద్రత నడుమ.. ఆక్సీజన్ ట్యాంకర్ అనంతపురం చేరుకుంది. సూపర్ స్పెషాలిటీ, సర్వజన ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వ చేయనున్నారు. ఈ ట్యాంకర్ ను తీసుకువచ్చేందుకు.. దారిలో ఇబ్బంది ఎదురుకాకుండే ఉండేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో సంబంధాలు తెగిపోకుండా... గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అనంతకు చేర్చారు. ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మేరకు భద్రత ఏర్పాట్లు చేశారని పోలీసులు తెలిపారు. ట్యాంకర్ వాహనం ఖాళీగా వెళ్లేటప్పుడు, ఆక్సీజన్ నిల్వల లోడుతో తిరిగి వచ్చేటప్పుడు ఎస్కార్ట్ వాహనం వెంట వెళ్తోందన్నారు.
ఇదీ చూడండి: