ETV Bharat / state

online Cheating: ఆన్​లైన్​లో ఇన్వర్టర్ ఆర్డర్ చేస్తే.. బండరాయి వచ్చింది!

author img

By

Published : Jun 13, 2021, 3:06 AM IST

గుదిబండగా మారిన విద్యుత్ కోతల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి.. ఇన్వర్టర్​ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. అక్కడ మరో బండరాయి ఇంటికొచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో జరిగింది.

online Cheating
online Cheating

ఇంటికి అవసరమైన ఇన్వర్టర్ ఆన్​లైన్​లో ఆర్డర్ చేసిన వ్యక్తికి.. పార్సిల్​లో బండరాయి రావడంతో అవాక్కయ్యాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత వ్యాపారి ఆదినారాయణ నాలుగు రోజుల క్రితం అమెజాన్ ద్వారా ఇన్వర్టర్ కొనుగోలు చేశాడు. డెలివరీ వచ్చాక తెరిచి చూడగా... అందులో 5 కిలోల బరువు ఉన్న బండరాయి కనిపించింది. అమెజాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయగా... మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని వారు బదులిచ్చారు. నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

wife fight: 'పదేళ్లు కాపురం చేశాడు..ఇప్పుడు వదలించుకోవాలనుకుంటున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.