అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, తెదేపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గుంతకల్లు పట్టణంలోని ధోనిముక్కల రోడ్డులో ఇందిరమ్మ కాలనీలో పేదలకు గతంలో ఇంటి స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకుని ఇతరులకు కేటాయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు.
ఇందిరమ్మ కాలనీలోని స్థలాలను జూలై 8 న ఇతరులకు పట్టాలు ఇవ్వడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని మిత్రపక్షాలు గుంతకల్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చూడండి : కోర్టులే పరిపాలిస్తామంటే మేమెందుకు..? : సభాపతి తమ్మినేని