మూడు రోజుల క్రితం తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు మహేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుడంగా ఆపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నందుకు 5 వేల రూపాయలు చలనా వేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికాడు. ఇలా ప్రతిసారీ పోలీసులకు దొరకుతున్నానని మనస్తాపం చెందిన మహేష్... పంటలకు పిచికారీ చేసే పురుగులు మందు తాగి గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సృహ తప్పి మైదానంలో పడి ఉన్న అతన్ని... స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. పోలీసుల వేధింపు వల్లే తాను ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు. గుత్తి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్నానన్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: