అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. డ్రైవర్ పక్కనే కూర్చున్న సీతారాంపల్లికి చెందిన నాగిరెడ్డి (72) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులతో ధర్మవరం నుంచి మామిళ్లపల్లి వెళ్తున్న ఆటోను.. పాల క్యాన్లతో వస్తున్న మరో ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గుత్తి శివారులో జీపు బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు