ETV Bharat / state

ద్విచక్రవాహనాలు ఢీ... మహిళ మృతి - గందోడివారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

అనంతపురం జిల్లా తనకల్లు మండలం గందోడివారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొనటంతో ప్రమాదం చోటుచేసుకుంది. పరాకులవాండ్లపల్లి పశు వైద్యశాలలో సహాయకురాలిగా పనిచేస్తున్న విజయలక్ష్మి అనే మహిళను చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు.

death
death
author img

By

Published : May 25, 2021, 12:22 AM IST

అనంతపురం జిల్లా తనకల్లు మండలం గందోడివారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. పరాకులవాండ్లపల్లి పశు వైద్యశాలలో సహాయకురాలిగా పనిచేస్తున్న విజయలక్ష్మి.. విధి నిర్వహణలో భాగంగా తోటి ఉద్యోగితో కలిసి ద్విచక్రవాహనంపై గందోడివారిపల్లికి వెళ్తోంది. అదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనపై తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:

ఆనందయ్య ఔషధంపై ఐదారు రోజుల్లో తుది నివేదిక: ఆయుష్ కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.