ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం... డిపోల వద్ద సంబరాలు - On the merger of the RTC with the government celebrating the workers at the ananthapuram
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈయూ, ఎన్ఎంయూ, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. కార్మికులు... ఉద్యోగుల అయ్యారని హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి సీఎం జగన్కు కృతజ్ఞతలు చెప్పారు. విజయనగరం జిల్లా సాలూరులోనూ సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజన్న దొర పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై డిపోల వద్ద కార్మికుల సంబరాలు
Intro:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో వద్ద సంబరాలు చేసుకున్నారు ఎంప్లాయిస్ యూనియన్ ఎన్ఎంయు వైయస్సార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో డిపో మేనేజర్ మల్లికార్జున పాల్గొన్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కార్మికులు ఉద్యోగుల అయ్యారని యూనియన్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు