పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సన్నద్ధమవుతున్నారు. పరిషత్ ఎన్నికల వేళ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్డీఓ వెంకటరెడ్డి.. ఎన్నికల సామగ్రిని, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ నిర్వహణకు అనువైన కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై సిబ్బందితో చర్చించారు.
ఇదీ చదవండి: 'అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఎన్నికల బహిష్కరణ'