ETV Bharat / state

పంట నష్టాన్నిఅంచనా వేయాలన్న ప్రభుత్వం - జంకుతున్న అధికారులు- జగన్ వ్యాఖ్యలే కారణమా? - ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టాలు

Officials Neglect on Drought Conditions in AP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావం, కరవుతో పంటలు పూర్తిగా ఎండిపోయిన రైతులు అధికారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కరవు నామమాత్రంగానే ఉందని, రైతులంతా ఆనందంగా ఉన్నారని సీఎం జగన్ చెప్పడంతో.. అధికారులు వాస్తవ లెక్కలు చెప్పడానికి వెనుకడుగు వేస్తున్నారు.

Officials_Neglect_on_Drought_Conditions_in_AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 9:11 AM IST

Updated : Nov 22, 2023, 10:55 AM IST

పంట నష్టాన్నిఅంచనా వేయాలన్న ప్రభుత్వం - జంకుతున్న అధికారులు- జగన్ వ్యాఖ్యలే కారణమా?

Officials Neglect on Drought Conditions in AP : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడుతున్నా క్షేత్రస్థాయిలో పంటలను సందర్శించడానికి అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. కరవును అంచనా వేయటానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఆచితూచి ముందుకు పోతున్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో కరవు నామమాత్రంగానే ఉందని, రైతులంతా సంతోషంగా ఉన్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) ప్రచారం చేసుకుకోవడమే. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వాస్తవ లెక్కలు చెబితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిట్లవుతుందని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

CM Jagan Comments on Drought : ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావం, కరవుతో పంటలు పూర్తిగా ఎండిపోయిన రైతులు అధికారుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. పంట నష్టం రాసుకోటానికి వస్తే, తాము ఇంటి వద్ద లేకుంటే పరిహారం రాదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట కోత ప్రయోగాలు చేసిన అర్థగణాంక శాఖ అధికారులు అన్ని పంటలు ఉత్పత్తి, ఉత్పాదక పూర్తిగా తగ్గిపోయినట్లు తేల్చారు. కొన్నిచోట్ల వేరుసెనగ, ఉలువ, పత్తి తదితర పంటలు పెట్టుబడి మేరకు కూడా దిగుబడి రాలేదని, మరికొన్నిచోట్ల పైరు పూర్తిగా ఎండిపోయి చేతికందలేదని గుర్తించారు. గతంలో ఏటా పంటకోత ప్రయోగాల వివరాలు అడిగిన వాళ్లందరికీ ఇచ్చే ఈ శాఖ అధికారులు ఈసారి ప్రధాన పంటలైన వేరుసెనగ, పత్తి తదితర పంటల దిగుబడి అంచనాలు గోప్యంగా ఉంచటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరవు తాండవిస్తున్నా కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చే యత్నం - రైతుల కన్నీరు కనిపించడం లేదా?

Drought in Andhra Pradesh : తీవ్ర వర్షాభావంతో వ్యవసాయ పంటలతో పాటు, ఉద్యాన, మల్బరీ పంటలకు నష్టం ఏర్పడింది. వ్యవసాయ పంటల్లో సింహభాగం సాగయ్యే వేరుసెనగకు ఎక్కువగా నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అనంతపురం జిల్లాలో మాత్రమే వ్యవసాయ పంటలకు 158 కోట్లు నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. ఇది వెయ్యి కోట్లకు పైగా ఉందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. అలానే బత్తాయి, దానిమ్మ, బొప్పాయి పంటల్లో పిందెలు పూర్తిగా రాలిపోయాయి. చాలాచోట్ల విద్యుత్ కోతలతో నీరున్నా పండ్లతోటలకు అందించ లేకపోడంతో అన్నిచోట్లా రైతులకు తీవ్రమైన నష్టం ఏర్పడింది.

కరవు, జగన్ కవల పిల్లలు - చిన్న కరవే అని సీఎం చెప్పడం మూర్ఖత్వం : లోకేశ్

Farmers Suffering With Rain Conditions : శ్రీసత్యసాయి జిల్లాలోనూ అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేయలేదు. పంట నష్టం అంచనాలు కోరిన రైతు సంఘాల నేతలకు ఇంకా పూర్తి కాలేదని, మరో వారం రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కరవు పరిశీలనలో అధికారుల తీరుపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Andhra Pradesh Farmers Suffering With Drought Conditions : ఎట్టకేలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా పంట నష్టం అంచనాలు ఎప్పటికి పూర్తి చేస్తారో వ్యవసాయ అధికారులు కచ్చితంగా చెప్పటం లేదు.

కడుపు నిండి'నోళ్లకేం' తెలుసు కరవు కష్టం - కొద్దిపాటిదే అన్నట్లుగా జగన్​ తీరు

Last Updated : Nov 22, 2023, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.