ETV Bharat / state

కొత్తకోట మిస్టరీ... ఆ ముగ్గురినీ హతమార్చింది ఎవరో! - శివరామిరెడ్డి

కొత్తకోట శివాలయం ఆవరణలో ముగ్గురి హత్య కలకలం రేపింది. పోలీసులకు ఇదో సవాల్​గా మారింది. గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డీఎస్పీ శ్రీనివాసులు చెబుతున్నప్పటికీ... కేసు ఛేదనలో నిర్లక్ష్యం కనిపిస్తోందనే భావన వ్యక్తమవుతోంది.

కొలిక్కిరాని కొత్తకోటలోని హత్య కేసు
author img

By

Published : Jul 18, 2019, 10:47 PM IST

కొలిక్కిరాని కొత్తకోటలోని హత్య కేసు

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొత్తకోట శివాలయం ఆవరణలో నిద్రిస్తున్న ముగ్గురిని కిరాతకంగా హత్యచేసి నాలుగు రోజులు గడుస్తున్నా... నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారు. గుప్త నిధుల అన్వేషణే కాక, ఇతర అంశాలపై దృష్టిసారించిన పోలీసులు... భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కొత్తకోట పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. హతుల్లో ఒకరైన శివరామిరెడ్డికి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయని, అవే హత్యకు దారితీసి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన స్వగ్రామమైన తంబళ్లపల్లితోపాటు తనకల్లు మండలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేయింబవళ్లు పోలీసుల గస్తీతో కొత్తకోట వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామంలోని వీధులన్నీ వెలవెలబోతున్నాయి. సందడిగా ఉండే బస్టాండ్ ప్రాంగణం బోసి పోయింది. నిందితుల కోసం ఏర్పాటు చేసిన బృందాలు... అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి... చదవలేనని తెలిసి... తనువు చాలించింది!

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_48_04_CMRF_Distribution_AVB_C8

Body:ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వర్తించని జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సాయం అందించి ఆదుకుంది .అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఐదేళ్ల కాలంలో ఏడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి రూపంలో పేదలకు అందించినట్లు మాజీ శాసనసభ్యుడు చాంద్ బాష తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా గతంలో మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. 31 మంది బాధితులకు 11 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశారు.

Conclusion:బైట్
చాంద్ బాష, మాజీ శాసనసభ్యుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.