స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని... మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే అండగా నిలిచారని గుర్తు చేశారు. బీసీలు లేనిదే తేదేపా లేదని పేర్కొన్నారు. కిందటి ఎన్నికల్లో వైకాపా తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో తెదేపాను అత్యధిక మెజార్టీతో గెలిపించి వైకాపాకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం పని చేయాలని సూచించారు. బడుగుబలహీన వర్గాల ప్రజలకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ... వినియోగదారులకు స్వల్ప ఊరట...తప్పిన విద్యుత్ ఛార్జీల భారం