NACIN Industry : అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద దాదాపు 500 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల అకాడమీ పరిశ్రమ (నాసిన్)ను నిర్మించనుంది. ఈ నాసిన్ పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి5న భూమి పూజ చేసి ప్రారంభించనున్నారు. ఆ ఏర్పాట్లను అధికారుల బృందం పర్యటించి పరిశీలించింది.
నాసిన్ ప్రతినిధులు వివేక్ జోరి, సంగీత శర్మ, ప్రాజెక్ట్ ఇన్చార్జ్ నారాయణ స్వామి బృందం కేంద్రమంత్రి పర్యటన కార్యక్రమాలు, ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Central Minister Shekhawat: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న కేంద్రమంత్రి