అనంతపురం జిల్లా ఉరవకొండలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని ఈద్ దర్గా వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని.. కరోనా మహమ్మారి అంతమవ్వాలని.. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ని కోరుకున్నట్లు ముస్లిం సోదరులు తెలిపారు.
కొందరు ఇంటి వద్దే రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు.సేవా భావానికి ప్రతీక అయినా రంజాన్ పండుగను ప్రతి ముస్లిం సంతోషంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండీ.. అంబులెన్స్‌ల నిలిపివేతతో... ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత