అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక సంఘంలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. రాయదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు గాను.. 159 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో మంగళ, బుధవారాల్లో 79 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 80 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
అందులో తేదేపా 31, వైకాపా 32, జనసేన 9, భాజపా 4, సీపీఐ 1, ఎంఐఎం 1, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్య తెలిపారు.
ఇదీ చదవండి: