ETV Bharat / state

మా గురువు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాం: ఫైట్​ మాస్టర్స్​ రామ్, లక్ష్మణ్ - సినీ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్

అనంతపురంలో సినీ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ మొక్కలు నాటారు. మానవ మనుగడకు పంచభూతాలు అవసరమని.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు.

movie fighters ram and laxman planted plants at anantapur
అనంతపురంలో మొక్కలు నాటిన రామ్, లక్ష్మణ్
author img

By

Published : Jul 2, 2021, 2:13 PM IST

అనంతపురంలో మొక్కలు నాటిన రామ్, లక్ష్మణ్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని సినీ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది, టవర్ క్లాక్ వద్ద ఉన్న ప్రెస్ క్లబ్​లో జర్నలిస్టులతో కలిసి అన్నదమ్ములిద్దరూ మొక్కలు నాటారు. ప్రస్తుత సమాజంలో ప్రకృతి వినాశనం కోరితే మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. కరోనా సమయంలో తమ గురువైన గురునాన్ తెలిపిన అంశాలను తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. మొక్కలు నాటి ప్రకృతిని సంరక్షించాలని ఆయన తెలిపినట్లు వారు చెప్పారు.

మానవ మనుగడకు పంచభూతాలు అవసరమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అనంతపురంలో మొక్కలు నాటడానికి ఇక్కడ ఉన్న తమ మిత్రులే కారణమని తెలిపారు. తాగడానికి నీరు కొనుక్కునే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛమైన గాలిని కొనుక్కునే పరిస్థితి వస్తోందని తెలిపారు.

ఇదీ చూడండి. FAKE NOTES: యూట్యూబ్‌ చూసి.. దొంగనోట్లు తయారీ చేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.