పుట్టపర్తి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలకు ఎక్కడా గండి పడకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చిత్రావతి నది పరిసర ప్రాంతాలతో పాటు, చెరువులు, కుంటలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న చెరువు కట్టలకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీరు వృథా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువుల్లో నీరు నిలువ ఉంటేనే బోరుబావులతో పాటు తాగునీటికి సమస్య ఉండదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 శాతం చెరువుల్లోకి వర్షపు నీరు చేరడంపై ఎమ్మెల్యే ఆనందం సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: