ETV Bharat / state

'పుట్టపర్తిని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం'

అనంతపురం జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని అన్ని విధాల అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. చిత్రావతి నది ఒడ్డున పర్యాటకుల సందర్శనార్థం ఏర్పాటు చేసిన బోటింగ్​ను ఆయన ప్రారంభించారు.

బోటింగ్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే
బోటింగ్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Mar 16, 2021, 3:29 PM IST

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు.. ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిత్రావతి నది ఒడ్డున సత్యసాయి భక్తులు పర్యాటకులను ఆకర్షించే విధంగా బోటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. బోటింగ్​ను​ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు. మహా సమాధి దర్శనార్థం దేశ విదేశీ భక్తులు పుట్టపర్తికి వస్తూ ఉంటారని తెలిపారు. ఆధ్యాత్మికతో పాటు పర్యాటకంగానూ.. ఆకర్షించేలా పుట్టపర్తిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 50 వేల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.