అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిప్పేపల్లి సమీపంలో గొర్రెల కాపరులకు ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ మాస్కులు అందించారు. మండలానికి వెళ్తోన్న ఆమెకు... రోడ్డు పక్కన మాస్కులు లేకుండా నలుగురు గొర్రెల కాపరులు కనిపించారు. కరోనా వ్యాప్తి సమయంలో మాస్కులు లేకుండా బయటకు రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం నలుగురికి మాస్కులు అందించారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తోన్న సమయంలో మాస్కులు ధరించాలని కోరారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బత్తాయి వ్యాపారులకు కలెక్టర్ అనుమతి