అనంతపురం నగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం అరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, తాము ఇచ్చిన మాట తప్పకుండా అన్ని విధాలా అనంతపురాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అనంత వెంకటామిరెడ్డి చెప్పారు. 'మన అనంత - సుందర అనంత' పనులు కరోనా వల్ల కొంత స్థంభించాయని, వారం రోజుల నుంచి మళ్లీ పరుగులు తీయిస్తున్నాయన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని వమ్ముచేయకుండా నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ అనంత వెంకటరామిరెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు.
'మన అనంతను - సుందర అనంతగా తీర్చిదిద్దుతాం' - mp rangayya latest comments
గుత్తేదారులు పనులు నాణ్యతగా చేయకపోతే ఉపేక్షించేదిలేదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. నగరం నుంచి 44వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానించే గుత్తి రహదారిని నాలుగు వరుసల రోడ్డుగా మార్చే పనులకు ఎమ్మెల్యే అనంత వెంకటామిరెడ్డి, ఎంపీ రంగయ్య భూమిపూజ నిర్వహించారు.