అనంతపురం జిల్లా తనకల్లు మండలం బిల్లూరివాండ్లపల్లిలో అదృశ్యమైన మహిళ ఆచూకీ లభించింది. భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన నారాయణమ్మ కోసం కుటుంబ సభ్యులు పరిసరాల్లో గాలించారు. గ్రామానికి సమీపంలోని ఓ నీటి కుంట వద్ద ఆమె వస్తువులు కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అంతా భావించారు.
సమాచారం అందుకున్న పోలీసులు నీటి కుంటలోకి దిగి గాలించినా మహిళ ఆచూకీ తెలియలేదు. చివరకు గ్రామ సమీపంలోని ముళ్లపొదల్లో ఆమె ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించారు. నీరసంగా ఉన్నందున కదిరి ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పోలీసులే అన్నదాతలకు న్యాయం చేయాలి: సీపీఐ రామకృష్ణ