అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ సందర్శించారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ వసతి గృహాలు, సంక్షేమశాఖ కార్యాలయాలను మంత్రి పరిశీలిస్తున్నారు. పాఠశాల సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. ఈ దిశగా టేకులోడు గురుకుల పాఠశాలను పరిశీలించి ఆయన అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ , తరగతి గదులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పలు కార్యక్రమాలు ప్రవేశపెడుతోందని.. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి: