సామాజిక దూరాన్ని స్వచ్ఛందంగా పాటించాలని మంత్రి శంకర్ నారాయణ ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గ్రామ సచివాలయం వద్ద హైడ్రో క్లోరైడ్ ద్రావకాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి మంత్రి పిచికారీ చేయించారు. కొంత మందికి మాస్కులు పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు సూచించారు. రేషన్ షాపులను తనిఖీ చేసి సరుకులు పంపిణీ చేశారు. బాలయోగి గురుకుల పాఠశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. అన్ని సదుపాయాలను కల్పించాలని వైద్య అధికారులకు సూచించారు. ప్రభుత్వ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయలు, పండ్ల మార్కెట్ ను సందర్శించారు. అనంతరం కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు.
ఇదీ చూడండి: