జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో మంత్రి శంకర్నారాయణ పాదయాత్ర చేపట్టారు. నాగినాయనచెరువు తండా నుంచి నాగినాయనచెరువు వరకు పాదయాత్ర చేశారు. అనంతరం నాగినాయనచెరువులో రచ్చబండ-పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నారని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి
వర్సిటీల్లో పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు?: హైకోర్టు