అనంతపురం జిల్లా రొద్దం మండలం కేంద్రంలో బూచర్ల, నాగిరెడ్డిపల్లె గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షాలకు పడిపోయిన అరటి తోటను మంత్రి శంకరనారాయణ పరిశీలించారు. అంజప్ప, నాగిరెడ్డి అనే రైతులతో పాటు పలువురికి చెందిన.. సుమారు 30 ఎకరాల్లో అరటి తోట నేలవాలింది. దీనివల్ల దాదాపు రూ. 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర రహదారులు భవనాలు శాఖ మంత్రి అరటి తోటను పరిశీలించారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ఇవీ చదవండి: