అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం జూలుకుంట, ఈదులబలాపురం గ్రామాల్లో రాష్ట్ర బి.సి సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పల్లె పిలుపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలకుంట గ్రామంలో ప్రజలు, డ్వాక్రా మహిళలు మంత్రికి స్వాగతం పలికారు. గ్రామంలో కలియతిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కుమారస్వామి సర్కార్ పతనం ఖాయం!