మార్చి 7 నుంచి లేపాక్షి ఉత్సవాలు - లేపాక్షి వైభవం ఉత్సవాలపై రాష్ట్ర మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యలు
అనంతపురం జిల్లా వైభవాన్ని చాటేలా లేపాక్షి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు మంత్రి శంకరనారాయణ తెలిపారు. కలెక్టరేట్ పై ఉత్సవాలకు సూచికగా బెలూన్ ఎగురవేశారు. ఎంపీ రంగయ్య, కలెక్టర్ గంధం చంద్రుడు హాజరయ్యారు. మార్చి 7, 8 తేదీల్లో ఉత్సవాలు ఉంటాయన్నారు. జిల్లా ప్రాచీన ఘన చరిత్ర ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఈ ఉత్సవాలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. జిల్లాకు లేపాక్షి బసవన్న.. ఒక ఐకన్ అని ఎంపీ తలారి రంగయ్య అన్నారు.