అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి పూజ చేశారు. రూ. 138 కోట్లతో ఇంటింటికి నీరు అందించే పథకంలో భాగంగా స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ముందు శిలాఫలకం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు.
మంత్రి శంకర్ నారాయణతో పాటు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు అందించాలన్న సీఎం జగన్ కలను నెరవేర్చకుండా తెదేపా విఘాతం కలిగిస్తోందని బొత్స అన్నారు. ఎంత అడ్డుకున్న డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశికి ప్రతి పేదవాడికి ఇంటి స్థలాలు అందిస్తామని... స్పష్టం చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు మూడు కోట్ల 80 లక్షల రూపాయల చెక్కులు ఆయన అందించారు.
ఇదీ చదవండి: