ETV Bharat / state

వలసకూలీల కష్టాలు ఎప్పుడు తీరేనో..!

లాక్​డౌన్​ కరోనా కట్టడికి ఉపశమనంగా ఉంటే... వలసకూలీలకు మాత్రం ఇదో శాపంలా మారింది. సొంత వారిని కలుసుకోలేక..ఇంటికి వెళ్లలేక నానాయాతన పడుతున్నారు. ఎన్నో భవనాల నిర్మాణంలో వీరి హస్తం ఉన్నా...కనీసం వీరికి ఆపన్నహస్తం అందించే నాథుడే కరువయ్యాడు. చేతిలో చిల్లిగవ్వలేక.. తినడానికి తిండిలేక ..వేలకిలోమీటర్లు నడస్తూ అవస్థలు పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ కూలీలు ..బెంగుళూరు పోలీసుల కంట పడకుండా అర్థరాత్రి వేళ ఇంటి నుంచి మూటా, ముల్లె తలకెత్తుకొని, చంటిపిల్లలను చంకనేసుకొని బెంగళూరు నుంచి కాలినడకన తమ గ్రామాలవైపు నడుస్తున్నారు. అనంతపురంలో సీపీఎం, ప్రజాసంఘాలు వారికి సహాయం చేస్తున్నారు.

Migrant laborers reached to anantapur
అనంతపురంలో ఉత్తరప్రదేశ్ వలసకూలీలు
author img

By

Published : May 15, 2020, 1:50 PM IST

అనంతపురంలో ఉత్తరప్రదేశ్ వలసకూలీలు

పట్టెడన్నం కూడా పెట్టలేకపోయారు...

ఎక్కడ బెంగళూరు....ఎక్కడ ఉత్తరప్రదేశ్...వేల కిలోమీటర్లు కాళ్లరిగిపోయేలా నడుస్తున్నారు వారంతా. ఓవైపు ఆకలి అవుతున్నా.. దారివెంట వెళ్లేవారు గుక్కెడు నీరిస్తే చాలనుకొని వేల కిలోమీటర్లలోని తమ గ్రామాలకు పయనమవుతున్నారు. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తులన్నీ వారి చేతులమీదుగనే నిర్మాణాలయ్యాయి. పొట్ట చేతపట్టుకొచ్చిన ఆ పేదలకు పట్టెడన్నం పెట్టలేకపోయింది కర్ణాటక ప్రభుత్వం. లాక్ డౌన్ తెచ్చిన కష్టాలతో ఉపాధి కోల్పోయి... చేతిలో చిల్లిగవ్వలేక కాళ్లనే చక్రాలుగా చేసుకొని స్వగ్రామాలకు వెళుతున్నారు. హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిపై పసికందులను పట్టుకొని ఎండను లెక్కచేయకుండా వేల కిలోమీటర్లు నడిచివెళుతున్న వలస కూలీలను అనంతపురంలో సీపీఎం, ప్రజాసంఘాలు అక్కున చేర్చుకుంటున్నారు.

వలస కూలీలపై పోలీసులు లాఠీల ప్రతాపం ...

బెంగుళూరు నగరం పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అభివృద్ధికి ప్రత్యక్షంగా నిలిచే ఎన్నో బహుళ అంతస్తుల భవనాలు, మల్టీ కాంప్లెక్స్ ల నిర్మాణాలు. పారిశ్రామిక ఉత్పత్తులు అనేకం వలస కార్మికుల చేతులమీద అభివృద్ధి జరిగినవే. దశాబ్ధాల కాలంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బెంగుళూరు నగరానికి ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన లక్షలాదిమంది రెక్కల కష్టం మీదనే ఇవాళ బెంగుళూరు నగరం అభివృద్ధి సాధించింది. రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రనక, పగలనక కష్టం చేసిన ఉత్తరాది వలస కార్మికులు నేడు అక్కడి ప్రభుత్వానికి, సమాజానికి అక్కర లేకుండా పోయారు. నమ్ముకొని వచ్చిన మేస్త్రీలు మోసం చేయటమే కాకుండా.... ఇవ్వాల్సిన కూలీ డబ్బులు కూడా ఎగ్గొట్టటంతో... పట్టెడన్నం కోసం తపించిపోతున్నారు. కనీసం వీధుల్లోకి వచ్చి అడుక్కుందామన్నా.... పోలీసులు లాఠీలు విరిగేలా వలస కూలీలపై తమ ప్రతాపం చూపుతున్నారు. గదులు అద్దెకిచ్చిన యజమానులు సామాన్లు బయటపడేయటంతో... దిక్కుతోచని స్థితిలో వేల కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాది రాష్ట్రాలకు కాలినడకన వెళుతున్న వారి పరిస్థితి ఊహకందనిది.

భయంతో అర్థరాత్రి వేళ పయనం...

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఎక్కడా పనిలేదు....రోడ్డెక్కి అడుక్కుందామంటే వెలుపలికి రాకూడదనే ఆంక్షలు, పోలీసుల బెదిరింపులు..ఇలా ఎన్నో రోజులు గదికే పరిమితమై నీళ్లతోనే ఆకలితీర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ బెంగుళూరు వచ్చిన లక్షలాది మంది నేడు ఆకలితో అల్లాడిపోతున్నారు. వీరంతా పోలీసుల కంట పడకుండా అర్థరాత్రి వేళ ఇంటి నుంచి మూటా, ముల్లె తలకెత్తుకొని.. చంటిపిల్లలను చంకనేసుకొని బెంగుళూరు నుంచి కాలినడకన తమ గ్రామాలవైపు నడుస్తున్నారు. అనంతపురంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై నాలుగు రోజులుగా వేలాది మంది వలస కార్మికులు బారులు తీరి నడిచి వెళుతున్న పరిస్థితులు హృదయాలను కలిచివేస్తున్నాయి.

అక్కున చేర్చుకున్న అపన్నహస్తాలు...

బెంగుళూరు నుంచి జాతీయ రహదారిపై నడిచివెళుతున్న వారిపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనికరం కూడా చూపటంలేదు. వీరి పరిస్థితిని గమనించి దాతలు, ప్రజాసంఘాలు, సీపీఎం పార్టీ నాయకులు ముందుకు వచ్చి ఎవరికి తోచింది వారు సహాయం అందిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తమ కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై ఖాళీగా వెళుతున్న లారీలను ఆపి.... వలస కూలీలను ఎక్కించి పంపుతున్నారు. నడిచి వస్తున్న వలస కూలీలకు శానిటైజర్లు అందిస్తూ... కడుపునిండా ఆహారం అందించి పంపుతున్నారు.

ఇదీచూడండి. వలస జీవి.. 'నడక' యాతన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.