లాక్‌డౌన్ ప్రత్యక్షంగా కరోనా కట్టడికి ఉపయోగపడుతుంటే.. పరోక్షంగా ఎందరినో ఇబ్బందుల్లో పడేసింది. వలసకూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తినేందుకు తిండిలేక పస్తులతోనే కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ.. అవస్థలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటక రాష్ట్రం హోసూర్, బెంగళూరు ప్రాంతాలకు చెందిన 9 మంది వలస కార్మికులు సైకిల్ పై అనంతపురం చేరుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ తో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్ చేరుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. సైకిళ్లపై అనంతపురం వరకు చేరుకున్నామని... సమయానికి తినడానికి తిండి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ అధికారులు స్పందించి తమను ఉత్తరప్రదేశ్ రైలులో పంపించే ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.
ఇదీ చూడండి: