ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు అనంతపురంలో వైకాపా నేత మహాలక్ష్మి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డితో కలిసి ఇంటింటికీ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. నగరంలో సుమారు 2 లక్షల శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్లు నేతలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా 25వ డివిజన్లో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: