ETV Bharat / state

బోగస్‌ కంపెనీ మోసంలో... పోలీసుల భాగస్వామ్యం?? - కడప తాజ వార్తలు

బోగస్‌ కంపెనీ అధిక వడ్డీ మోసం కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న విషయం తీవ్ర దుమారం రేపుతోంది. ఐబిడ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 300 కోట్ల రూపాయల మోసంలో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

policemen were involved
పోలీసుల భాగస్వామ్యం
author img

By

Published : Apr 18, 2021, 8:28 AM IST

ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి అనంతపురం, కడప జిల్లాల్లో 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటనలో కొందరు పోలీసుల ప్రమేయం ఉందన్న సమాచారం కలకలం రేపుతోంది. ఐబిడ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనే బోగస్‌ సంస్థ ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా... నెమ్మదిగా డొంకంతా కదులుతోంది. ఓ కానిస్టేబుల్ 122 మందితో 12 కోట్ల రూపాయల మేర డిపాజిట్లు చేయించినట్లు తెలుస్తోంది. ఓ ఎస్సై కోటిన్నర, మరో ఎస్సై 25 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టి ప్రతినెలా 30 శాతం వడ్డీ తీసుకుంటున్నారని నిందితులు వెల్లడించారు.

కదిరిలో.. ఓ విశ్రాంత డీఎస్పీ సైతం భారీగా పెట్టుబడి పెట్టినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు.. నార్పల, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 50 లక్షల మేర మోసపోయామని మరో ఐదుగురు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు అనంతపురం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా డెస్కులు ఏర్పాటు చేశారు. బోగస్ కంపెనీ గురించి ఆరా తీసేందుకు సోమవారం జిల్లా నుంచి పోలీసు బృందం మహారాష్ట్రలోని నాగపూర్‌కు వెళ్లనుంది.

ఇదీ చదవండి:

మాస్క్‌ మాత్రమే కరోనా నుంచి కాపాడగలదు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.