అనంతపురం జిల్లా కొండమనాయినిపాలెం వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. నీటి ఉధృతిలో చిక్కుకుపోయాడు. యాకాలచెరువుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి చేపలు పట్టేందుకు కొండమనాయినిపాలెం వాగు వద్దకు వెళ్లాడు. వాగు మధ్యలోకి వెళ్లి.. చేపలు పడుతున్న సమయంలోనే.. వరద నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఈ విషయాన్ని గుర్తించే సరికి ఆలస్యమైపోయింది. వరదలో నుంచి బయటకు రాలేకపోయాడు. నీటిలో చిక్కుకున్న విషయం అర్థం చేసుకున్న సదరు వ్యక్తి.. కాపాడాలంటూ అరిచాడు. కానీ.. ఒడ్డున ఉన్న భార్య ఏమీ చేయలేకపోయింది. దీంతో.. వెంటనే అప్రమత్తమైన ఆమె.. తన భర్తను కాపాడాలంటూ సమీప గ్రామాలైన కొండమనాయుని పాలెం, వరిగిరెడ్డిపల్లి వాసులను కోరింది. దీంతో.. స్థానికులు జేసీబీని వెంట తీసుకెళ్లి, తాళ్ల సాయంతో అతన్ని కాపాడారు.
ఇదీ చదవండి: YCP Internal Clashes: మంత్రికి సొంత పార్టీ నేత సవాల్.. నియోజకవర్గంలో హైటెన్షన్ !