అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో శివ దత్త అనే ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుంతకల్లు మండలం గుర్రబ్బాడు గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. పామిడి పట్టణంలోని శివ దత్త ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అయితే అక్కడ పరీక్షించిన ఆర్ఎంపీ.. చికిత్స ఇవ్వాలని అందరూ బయటకు వెళ్లాలంటూ బంధువులను బయటకు పంపాడు. అనంతరం ఇంజక్షన్ ఇవ్వగా.. కాసేపటికే రోగి మృతి చెందాడు.
మరో ఇంజక్షన్ ఇవ్వాలంటూ..
మరో ఇంజక్షన్ ఇవ్వాలంటూ.. అది బయట షాపులో దొరుకుతుందని బంధువులతో చెప్పాడు. వారు బయటకు వెళ్లగానే గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పడేసి తన ఆసుపత్రికి తాళాలు వేసి ఉడాయించాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: DOUBLE MURDER: కర్నూలు జిల్లాలో దారుణం.. ఇద్దరు హత్య