అనంతపురం ఆరోరోడ్డుకు చెందిన సలీం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య చికిత్స కోసం హుటాహుటిన కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఛాతి భాగంలో బలమైన గాయమై, నోటి నుంచి రక్తం వస్తుండటంతో చికిత్స చేయటానికి వైద్యులు నిరాకరించారు. ఫలితంగా.. చేసేదేమీ లేక నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా అక్కడా... చేర్చుకోలేదు. గత్యంతరం లేక సలీంను మళ్లీ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే సలీం ప్రాణాలు కోల్పోయాడని... కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని బంధువులు... ఆందోళన చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆస్పత్రిలో చేర్చుకోకపోవటంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన చెందారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.
సజ్జల గారూ... ముందు జగన్‌కు అ, ఆ లు నేర్పించండి: దీపక్‌రెడ్డి